Last Updated:
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై చెలరేగిన ఆమె, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల ఆల్ టైమ్ రికార్డును స్మృతి బద్దలు కొట్టింది.














