Last Updated:
నాగచైతన్య, శోభిత ధూళిపాళ, టాలీవుడ్ కపుల్, అక్కినేని నాగచైతన్య, తండేల్, వృషకర్మ, వెట్టువం, చీకటిలో సినిమా, నాగచైతన్య ఇన్స్టాగ్రామ్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత ఈ జంట చేసే అల్లరి, క్యూట్ పోస్ట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భార్య శోభితకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను పంచుకోగా, దానికి ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌తో నిత్యం బిజీగా ఉండే ఈ దంపతులు ఏమాత్రం సమయం దొరికినా ఒకరికొకరు కేటాయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శోభిత వంటగదిలో గరిటె పట్టారు. తన భర్త కోసం స్వయంగా ఎంతో ఇష్టంగా వంట చేశారు. కిచెన్‌లో శోభిత వంట చేస్తున్న ఫొటోను నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఓ సరదా క్యాప్షన్ జతచేశారు. “పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం వంట చేసింది. బహుశా.. ఈ రోజు నేను ఏదో చాలా మంచి పనే చేసి ఉంటాను” అని చైతూ తనదైన శైలిలో రాసుకొచ్చారు.
భర్త చేసిన ఈ పోస్ట్‌ను చూసిన శోభిత వెంటనే దానికి కౌంటర్ ఇచ్చారు. చైతూ పోస్ట్‌ను రీ-స్టోరీ చేస్తూ.. “నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా.. లేక పొగుడుతున్నావా?” అంటూ ఓ ఫన్నీ ఎమోజీని జోడించారు. ఈ భార్యాభర్తల క్యూట్ అండ్ ఫన్నీ సంభాషణ అభిమానుల మనసు దోచుకుంటోంది. నెటిజన్లు ఈ పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తూ, ‘బెస్ట్ కపుల్ గోల్స్’, ‘చైతూ టైమింగ్ అదుర్స్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఈ జంట కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో ‘విరూపాక్ష’ లాంటి హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే పవర్ఫుల్ మైథలాజికల్ చిత్రంలో చైతూ నటిస్తున్నారు. మరోవైపు శోభిత సైతం తనదైన మార్క్‌తో డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌లో ఆమె నటనకు విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘వెట్టువం’ అనే తమిళ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














