TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి!



అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని పక్కదారి పట్టించడానికి సీబీ-సీఐడీ విచారణ అంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని కాంగ్రెస్ తన ఇష్టానుసారంగా నడిపిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని తలసాని ధ్వజమెత్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports