Last Updated:
Telangana Congress: పార్టీ లైన్ దాటడానికి వీల్లేదని హైకమాండ్ గీత గీస్తే దాన్ని ఎవరూ లెక్క చేయడం లేదు. టైమ్ వచ్చినప్పుడల్లా రాష్ట్ర అధినాయకత్వంపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. పార్టీని పది మందిలో పలచన చేస్తూనే వస్తున్నారు. దీనికి కొండా సురేఖ కావచ్చు చిన్నారెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అటుపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒకరి తర్వాత మరొకరు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే సొంత ఇంట్లోనే కుంపటిలా మారింది. పార్టీ లైన్ దాటడానికి వీల్లేదని హైకమాండ్ గీత గీస్తే దాన్ని ఎవరూ లెక్క చేయడం లేదు. టైమ్ వచ్చినప్పుడల్లా రాష్ట్ర అధినాయకత్వంపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. పార్టీని పది మందిలో పలచన చేస్తూనే వస్తున్నారు. దీనికి కొండా సురేఖ కావచ్చు చిన్నారెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అటుపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒకరి తర్వాత మరొకరు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. తమలోని అసంతృప్తిని, ఆగ్రహాన్ని పబ్లిక్ మీటింగ్‌ల్లోనే బయటపెట్టేస్తున్నారు. మరి దీనికి మందు ఏంటీ అనే ఆలోచనలోనే కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత వారం పది రోజులుగా మంత్రి కొండా సురేఖ కూతరు సుస్మిత పటేల్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని పదవుల్లోంచి తప్పించాలని సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఓ నివేదికను టీపీసీసీ చీఫ్‌కి అందజేశారు. మరి దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పెద్దలను కలిసి ఏం యాక్షన్ తీసుకోవాలని అడగనున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే కూతురు చేసిన కామెంట్స్‌కి కొండా సురేఖపై చర్యలు తీసుకోవడం సబబెనా..? చిన్నారెడ్డి కామెంట్స్ పార్టీని డ్యామేజ్ చేసే అంతగా ఉన్నాయా అంటే వీళ్ల కంటే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు రేవంత్ రెడ్డిపై , ఆయన పాలనపై విమర్శలు చేశారు. మరి ఆయనపై చర్యలు తీసుకోవడంలో హైకమాండ్ ఎందుకు జాప్యం చేస్తోంది..? అయనపై వేటు వేసినా.. పార్టీ నుండి బహిష్కరిస్తే జరిగే పరిణామాలు తెలిసే కాంగ్రెస్ పెద్దలు సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారా అనే డౌట్స్ ఇప్పుడు అందరికి వస్తున్నాయి. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాటలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.














