Telegram: ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం | | ACTPnews

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం


Last Updated:

Telegram: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు ముందు, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించడంతో టెలిగ్రామ్‌ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లగా.. అక్కడ కూడా రిలీఫ్ లభించలేదు. ఏమైందో తెలుసుకుందాం.

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం

ఆ మధ్య వివాదాస్పదమైన నీట్-యూజీ 2026 పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ పరిస్థితుల్లో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. వెంటనే ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి.. తమకు వెంటనే రిలీఫ్ ఇవ్వాలని జూన్ 17 బుధవారం కోరింది. కానీ ఢిల్లీ హైకోర్టు వెంటనే రిలీఫ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదని న్యూస్18 రిపోర్ట్ చేసింది.

తమపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు వ్యతిరేకంగా తన దగ్గర తగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి: Trump on Iran: G-7 వేదికపై ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్.. మళ్లీ యుద్ధ అడుగులు.. 3 కీలక ప్రకటనలు

ఈ బ్యాన్ విషయాన్ని టెలిగ్రామ్.. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించగా, ఆ బెంచ్.. ఈ కేసును అత్యవసర ప్రాతిపదికన విచారించడానికి అంగీకరించారు. దీనిపై కేంద్రం వివరణ కోరగా.. తమ సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సమయం కోరింది. దాంతో ఈ కేసు విచారణ ఇప్పుడు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

టెలిగ్రామ్ తరఫున హాజరైన లాయర్.. ప్రభుత్వ చర్య వల్ల 15 కోట్ల మందికి పైగా వినియోగదారులు ప్రభావితమయ్యారని కోర్టుకు తెలిపారు. ఈ బ్లాకింగ్ ఉత్తర్వు ఏకపక్షంగా తీసుకున్నారనీ, దీనికి తగిన కారణాలు లేవని ఆ ప్లాట్‌ఫామ్ తరపున వాదించారు. “దేశంలో 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మీరు ప్రతీదాన్నీ బ్లాక్ చేస్తారు. ఆర్టికల్ 14ను పూర్తిగా ఉల్లంఘించారు” అని న్యాయవాది అన్నారు.

కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నిషేధానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు వ్యతిరేకంగా తగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. “మేము మే నెల నుంచే వారితో మాట్లాడుతున్నాము. మేము వెంటనే ఏమీ చెప్పలేము” అని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ఆందోళనలు చాలా వారాలుగా పరిశీలనలో ఉన్నాయని కేంద్రం వాదన సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి: Best SUV Cars: 27 కిమీ మైలేజ్, సన్‌రూఫ్. రూ.6 లక్షల్లో బెస్ట్ SUV కార్లు ఇవే!

సమస్యాత్మకంగా గుర్తించిన ఛానెళ్లు, ఖాతాలను నిరోధించడం ద్వారా తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆ ప్లాట్‌ఫామ్ కోర్టుకు తెలిపింది. అయితే పదేపదే జరుగుతున్న ఉల్లంఘనలపై ప్లాట్‌ఫామ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. అందుకే బ్యాన్ విధించినట్లు చెప్పింది.

మొత్తంగా వెంటనే రిలీఫ్ లభించలేదు. గురువారం కేంద్రం చెప్పే వాదన, దానికి టెలిగ్రామ్ తరపు లాయర్ చెప్పే వాదనలను బట్టీ.. ఢిల్లీ హైకోర్టు తగిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు కేవలం కొన్ని రోజుల ముందు ఈ కేసు, ఈ బ్యాన్ దేశవ్యాప్త చర్చగా మారింది. కొంతమంది ఇలాంటి చర్యలు తప్పవు అంటుంటే.. మరికొందరు.. దీని వల్ల టెలిగ్రామ్‌లో స్టడీ మెటీరియల్ చదివే వారికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. గురువారం కేంద్రం ఏం చెబుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *