Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

+

News18

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను టీటీడీ ప్రస్తుత పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అత్యంత తీవ్రంగా ఖండించారు. కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు హిందూ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువులను సమున్నతంగా ఉంచాల్సిన బాధ్యత కలిగిన ఒక ఉన్నత పదవిలో రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తి, ఇలా గురువులను కించపరిచేలా మాట్లాడటం వెనుక ఆయనకున్న దురుద్దేశం స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హిందూ సమాజంతో పాటు పీఠాధిపతులకు, ఆధ్యాత్మిక గురువులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి హిందూ ధర్మాన్ని, ఇక్కడి సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. భూమన చేసిన విమర్శల ద్వారా స్వామీజీలపై ఆయనకున్న వ్యతిరేక భావన మరియు ద్వేషం పూర్తిగా బయటపడిందని విమర్శించారు. గోశాలల నిర్వహణపై ఉన్న వాస్తవాలను, లోపాలను ప్రజలకు మరియు భక్తులకు వివరించడానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్న స్వామీజీలను ఇలా రాజకీయ కోణంలో విమర్శించడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

దేవుడు, దేవస్థానాల పవిత్రత గురించి.. వాటి రక్షణ గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు భూమన కరుణాకర్ రెడ్డికి లేదంటూ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా విగ్రహాల ధ్వంసం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలలో ఆలయ రథాల దహనం వంటి ఘోరమైన ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం నిందితులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హిందూ సమాజం మొత్తం అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసినా కనీసం స్పందించని వారు, ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే స్వామీజీలపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

తిరుమల కొండను, ఇక్కడి వ్యవహారాలను రాజకీయ లబ్ధి కోసం లక్ష్యంగా చేసుకుని భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమైనదని భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న తిరుమల పవిత్రతను కాపాడాల్సిన తరుణంలో, ఇలాంటి అనాలోచిత రాజకీయ విమర్శలతో సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. తిరుమల కొండను, హిందూ ధర్మాన్ని, స్వామీజీల గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా ముందుకు రావాలని, ఇటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వివాదం ప్రస్తుతం భక్తులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed