ప్రతిరోజూ తిరుమలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరించి ఇక్కడ నిశితంగా పరీక్షిస్తున్నారు. అన్నదాన వంటశాలలు, వివిధ అన్నప్రసాద కేంద్రాలు, ఫుడ్ కౌంటర్లు, స్థానిక హోటళ్లు, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విభాగాలు, మార్కెటింగ్ విభాగం గోదాముల్లోని ముడి సరుకుల నుంచి నిత్యం సుమారు 40 ఆహార నమూనాలను తీసుకుంటున్నారు. అదనంగా జలప్రసాదం కేంద్రాలు, ప్రధాన వాటర్ లైన్ల నుంచి మరో 20 నీటి నమూనాలను సేకరించి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే ఆయా విభాగాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.













