Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా | | ACTPnews

News18


Last Updated:

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు

+

News18

దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల సందడి మరింత ఎక్కువైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి భారీ రద్దీ మధ్య స్వామివారి దర్శనం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇద్దరు యువకులు తిరుమలకు చేరుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్వీర్ సింగ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ దేవాంగన్ అనే ఇద్దరు యువకులు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క అయినా నాటాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తూ వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఆలయాలు ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రజలను కలుసుకుని పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్వీర్ సింగ్ తాను ఇప్పటివరకు దాదాపు 50 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశానని తెలిపారు. అలాగే సౌరభ్ దేవాంగన్ ఇప్పటికే 18 వేల కిలోమీటర్లు నడిచినట్లు వెల్లడించారు. ఈ యాత్ర తమకు కేవలం ప్రయాణం మాత్రమే కాదని, ఇది సమాజానికి సందేశం ఇచ్చే ఒక సేవా కార్యక్రమమని చెప్పారు. యువతలో ప్రకృతి పట్ల బాధ్యత పెరగాలని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వేల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకోవడం తమ జీవితంలో మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని యువకులు తెలిపారు. భక్తి, సేవ, పర్యావరణ పరిరక్షణ అనే మూడు ముఖ్య లక్ష్యాలతో తమ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం వీరి సేవాభావం, పట్టుదలపై తిరుమలకు వచ్చిన భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports