భక్తుల రద్దీ అధికంగా ఉండే నడక మార్గాలు, నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, బస్టాండ్లు, చౌల్ట్రీలు, విశ్రాంతి భవనాలు, ఇతర ప్రధాన రద్దీ ప్రాంతాల వద్ద పోలీసులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉంటున్నారు. చిన్నారులు, వృద్ధులకు జియో ట్యాగ్లు ఏర్పాటు చేసి, వారు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన సందర్భంలో త్వరగా గుర్తించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రద్దీ ప్రాంతాల్లో చిన్నారులు, వృద్ధుల భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు.














