Last Updated:
అలిపిరి కాలిబాట మార్గంలో సంరక్షణ లేకుండా వెళ్తున్న ఇద్దరు బాలురను భక్తుల సమాచారంతో పోలీసులు సురక్షితంగా రక్షించారు.
డయల్–112కు సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు బాలుర వివరాలు సేకరించి, నిబంధనల ప్రకారం సంరక్షణ గృహానికి తరలించారు.
అలిపిరి కాలిబాట మార్గంలో సంరక్షణ లేకుండా వెళ్తున్న ఇద్దరు బాలురను తిరుపతి జిల్లా పోలీసులు సురక్షితంగా రక్షించారు. డయల్–112కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి బాలురను గుర్తించి తమ అదుపులోకి తీసుకున్నారు. బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు.














