సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నేతగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారు.సామాజిక న్యాయం, కాపు రిజర్వేషన్ల అంశంపై ఎన్నో ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు.
తిరుమల శ్రీవారి నిత్య హారతి దర్శనంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో ‘నిత్య హారతి’ అనే పేరుతో ఎలాంటి దర్శనం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం డీకే శివకుమార్ అవగాహన లేకుండానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నామని.. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులను తప్పుదారి పట్టించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర, దక్షిణ ప్రాంత పనులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సమావేశమవ్వగా, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వరంగల్ విమానాశ్రయ భూ సేకరణకు సీఎం చూపిన చొరవను అభినందిస్తూ మూడు వారాల్లో పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.
బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం, అధికారులు స్పందించి ఉంటే మత్స్యకారులు బతికేవారని, ఈ ఘోర నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖలోని జబ్బర్తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కనీసం ఉత్తరాంధ్ర మంత్రులు గానీ, ఫిషరీష్ మంత్రి గానీ బాధితులను పరామర్శించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
సింగరేణి నష్టాల బారిన పడటానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల దోపిడీ, నిర్లక్ష్యమే కారణమని, గత పదేళ్లుగా కార్మికుల శ్రమను దోచుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పర్యటించిన ఆయన, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పుణెలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించి, తమకు త్వరితగతిన న్యాయం చేయాలంటూ అతడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి భావోద్వేగపూరిత లేఖ రాశారు. కేతన్ దారుణ హత్యతో తన ప్రపంచమే అంతమైపోయిందని, ఆ విషాదాన్ని తట్టుకోలేక కొద్దిరోజుల వ్యవధిలోనే అతడి తాత దేవీచంద్ అగర్వాల్ కూడా ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆ వేదనలో పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతూ ఇరాన్ లక్ష్యంగా అమెరికా బలగాలు మరో 60 రోజుల పాటు యుద్ధాన్ని ప్రారంభించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌కు అధికారికంగా ‘వార్ పవర్స్ నోటీసు’ద్వారా తెలియజేశారు. అమెరికా ప్రజలను,జాతీయ భద్రతను కాపాడేందుకే ఈ సైనిక చర్యకు ఆదేశించానని, జులై 7 నుంచే ఈ దాడులు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలపై వరుసగా మూడో రాత్రి దాదాపు 5 గంటల పాటు అత్యంత భీకరమైన దాడులను పూర్తి చేసింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అమెరికా తన అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలతో నిరంతరాయంగా విరుచుకుపడుతూ ఇరాన్ రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది.
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న హీరో నాని చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడినట్లు చిత్రబృంద వర్గాల సమాచారం. షూటింగ్ పూర్తి కాకపోవడం, ప్రచారానికి తగిన సమయం లేకపోవడం వల్లే ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్ 24కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కెరీర్ ప్రారంభం నుండి వరుస పరాజయాలతో సరైన విజయం కోసం పదేళ్లకు పైగా ఎదురుచూసిన అక్కినేని అఖిల్‌కు ‘లెనిన్’ చిత్రం భారీ వసూళ్లతో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందించి ఆ లోటును భర్తీ చేసింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ నాలుగు రోజుల్లో 67.2కోట్లు (గ్రాస్)వసూలు చేసినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.













