గత 45 ఏళ్లుగా టీడీపీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారని, వారి అభ్యున్నతికి కృషి చేయడం తన కర్తవ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన మీ భూమి–మీ హక్కు గ్రామసభలో ఆయన మాట్లాడారు.స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్లు కల్పించగా, తాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు అండగా ఉంటామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున 34 శాతానికి మించి సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేకుండా అబద్ధాలు, రాజకీయ నాటకాలతో ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం ప్రచార పిచ్చికి నిదర్శనమని, కొత్తగా ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేపట్టిన భోగాపురం విమానాశ్రయ పనులు, రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని, న్యాయస్థానాల్లో నిలబడని అంశాన్ని జగన్‌కు ఆపాదించడం దుర్మార్గమని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
అర్ధరాత్రి వేళ రోడ్లు, ట్యాంక్‌బండ్, చెరువులు, పార్కుల వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.నిర్లక్ష్యంగా వేడుకలు నిర్వహించడం ప్రాణాల మీదకు తెస్తోందని, కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయం సాధించింది. మధురాంతకంలో మరగతం కుమారవేల్, ధారాపురంలో సత్యభామ గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని రెజినగర్‌లో భాజపా అభ్యర్థి శంఖారవ్ సర్కార్, నందిగ్రామ్‌లో హసిరానీ రత్ ఘన విజయం సాధించారు.సర్కార్ ప్రత్యర్థిపై 72 వేలకుపైగా ఓట్ల మెజార్టీ సాధించగా, హసిరానీ రత్ లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు.
ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ప్రతిపక్ష ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనల నేపథ్యంలో 20 వేల మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు సమాచారం. నేపథ్యంలో మెట్రో, రైలు సర్వీసులపై విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింపజేయడం సరైన చర్య కాదని పేర్కొంటూ, ఆంక్షలను తక్షణమే పునఃసమీక్షించాలని ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వాతావరణం భిన్నంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాబోయే 3–4 రోజుల్లో తెలంగాణ పరిసర ప్రాంతాల నుంచి రుతుపవనాలు మరింత వెనక్కి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీదుగా ద్రోణి కొనసాగుతున్నప్పటికీ, వర్షాలు కురిసే సూచనలు లేవని స్పష్టం చేసింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై గోవా పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద అసహజ మరణం కేసు నమోదు చేశారు.గోవాలోని డోనా పౌలాలో ఉన్న నివాసం నుంచి ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ నాయక్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు, కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేయనున్నారు. నానా పటేకర్ మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ మతాన్ని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం వ్యూస్ కోసం ఆధారాలు లేకుండా తన పేరుతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తన పేరుతో వస్తున్న ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మవద్దని, షేర్ చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన నుంచి అధికారిక సమాచారం వచ్చినప్పుడే నమ్మాలని ఇర్ఫాన్ పఠాన్ కోరారు.
2026 నోబెల్ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికాకు చెందిన భారత మూలాలున్న నవనీతమ్ ‘నవీ’ పిళ్లై ఎంపికైనట్లు ప్రకటించారు.శాంతి, అంతర్జాతీయ చట్టాల ప్రోత్సాహం, మానవ హక్కుల పరిరక్షణకు చేసిన కృషికి ఆమెకు ఈ పురస్కారం దక్కినట్లు సమాచారం.ఆమె 2008–2014 మధ్య ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా, 2003–2008 మధ్య అంతర్జాతీయ నేర న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేశారు.దక్షిణాఫ్రికాలో తొలి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన నవీ పిళ్లై పూర్వీకులు తమిళనాడు నుంచి వలస వెళ్లారు.ఆమె తల్లిదండ్రులు శాంతమ్మ నాయుడు, నారాయణస్వామి నాయుడు.
అమెరికా ప్రభుత్వం భారతీయ ఐటీ కంపెనీలకు మరియు H1B వీసాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ‘పర్మ్’ (PERM) లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ మరియు అడోబ్ వంటి దిగ్గజ టెక్ సంస్థలను సస్పెండ్ చేసింది. ఈ కంపెనీలు పర్మ్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నాయని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణల నేపథ్యంలో కొత్తగా పర్మ్ దరఖాస్తులు స్వీకరించబోమని, పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా ప్రాసెస్ చేయబోమని స్పష్టం చేశారు.













