Last Updated:
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు బాది ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఇషాన్ కిషన్ 22 బంతుల్లోనే 43 పరుగులతో ధాటిగా ఆడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 40 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖర్లో తిలక్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు వేగంతో అజేయంగా 44 పరుగులు రాబట్టడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా.. షమర్ స్ప్రింగర్ 2 వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ గెలవాలంటే 250 పరుగులు చేయాల్సి ఉంది.
Muscular and Intentful 💪
Sanju Samson made full use of the Powerplay ✅Updates ▶️ https://t.co/mZlyaWZsoe
#TeamIndia | #INDvWI | @mflone_ | @IamSanjuSamson https://t.co/ATcAq8UAX2
— BCCI (@BCCI) October 9, 2026














