Top 10 News: పవన్‌కు శస్త్ర చికిత్స.. జగన్ నైజం అదే.. నాన్న మరణానికి ప్రతీకారం.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు


సీఎం చంద్రబాబు, ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వం, నేతలపై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తరువాత జగన్ బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

2.పవన్‌కు మూడున్నర గంటల శస్త్రచికిత్స!

‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో, అలాగే 2019 రాయలసీమ పర్యటన, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాల్లో రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.నొప్పి తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే శస్త్రచికిత్స చేయగా, దీనికి మూడున్నర గంటల సమయం పట్టింది. మరో రెండు నెలల్లో ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

3. రేవంత్ రైతాంగాన్ని నిలువునా ముంచేస్తున్నారు

తెలంగాణలో సాగునీటి సంక్షోభంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షతో రైతాంగాన్ని నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని తెలిపారు. కన్నెపల్లి వద్ద 96.79 మీటర్ల నీటి మట్టం ఉండగా, 94 మీటర్ల వద్దే పంపులు ప్రారంభించవచ్చని నిపుణులు సూచించారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించి రైతులకు నీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

4.రేవంత్ రెడ్డి వేగం పెంచారు..!

కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయాలకు పూర్తి మద్దతు ఉంటుందని, 117 స్థానాల్లో విజయం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో చురుకుగా లేని ప్రజాప్రతినిధులను ఇప్పటికే అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, తాను ఎన్నికల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సంగారెడ్డి స్థానం మహిళలకు కేటాయించినా లేదా సాధారణ స్థానంగా ఉన్నా, తన భార్య నిర్మలనే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని జగ్గారెడ్డి వెల్లడించారు.

5.హైదరాబాద్‌‌కు మరో బుల్లెట్ రైళ్లు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను గణనీయంగా పెంచిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి రూ.880 కోట్లు మాత్రమే కేటాయించగా, ప్రస్తుతం తెలంగాణకే రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

6.జన నాయగన్‌కు సెన్సార్ క్లియరెన్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డుతో నెలల తరబడి కొనసాగిన వివాదాలు, న్యాయపరమైన అడ్డంకుల అనంతరం చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు

7.తారక్‌ మా పెద్దబ్బాయి..!

అఖిల్ ‘లెనిన్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌‌లో మాట్లాడిన నాగార్జున విజయమే లక్ష్యంగా చిత్రబృందం అంతా కష్టపడి పనిచేసిందని చెప్పారు. సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన తారక్‌ మా పెద్దబ్బాయ్‌ అంటూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ తనకు రెండు కళ్లు అని నాగార్జున అన్నారు..

8.భారత్‌ ఓ లాంచ్‌ప్యాడ్‌

ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాంకేతికత, సేవలు, పెట్టుబడులు, రాకపోకల్లో కొత్త అవకాశాలు తెరుస్తుందని చెప్పారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకు వచ్చిందని తెలిపారు. అలాగే స్మార్ట్ సిటీస్, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని న్యూజిలాండ్ కంపెనీలు, యూనివర్సిటీలను ఆహ్వానించారు.

9.నాన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి బాధ్యులపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని టెలిగ్రామ్ సందేశంలో పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల డిమాండ్ అని, హంతకులు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

10.1000 క్షిపణులను లోడ్‌ చేసిపెట్టాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే భారీ క్షిపణి, బాంబు దాడులు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే వేలాది క్షిపణులను సిద్ధంగా ఉంచి, అవసరమైతే ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై దాడులకు సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాను హత్యకు గురైతే ఎలా స్పందించాలనే దానిపై ముందుగానే సూచనలు జారీ చేశానని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ మాట్లాడుతూ, ఇరాన్ లొంగిపోవడం వల్ల యుద్ధం ముగియదని, అవసరమైతే దేశ రక్షణకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *