వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల వివరాల కోసం, వారికి తక్షణ సహాయం అందించడం కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Source link
Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











