Top10 News: ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ |


ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్‌ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్‌ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్‌ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది.

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం:

ధాన్యం కొనుగోళ్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లలో..

తెలంగాణ నెంబర్‌-1 అని కేంద్రం చెప్పిందన్నారు. మద్దతు ధర కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు.

యాసంగిలో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అంచనా వేశామన్నారు. కేంద్రం 52 లక్షల మెట్రిక్‌ టన్నులో కొంటామని చెప్పిందన్నారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొంటున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల కొరత ఉందన్నారు మంత్రి ఉత్తమ్.

చర్లపల్లి జైలుకు బండి భగీరథ్‌:

పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసింది. విచారణ తర్వాత పోలీసులు అతన్ని మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి సోషల్ మీడియా చాటింగ్‌లకు సంబంధించిన కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం:

మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే సూచన ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. జూన్‌ మొదటి వారంలో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు.

నైరుతి’ రాక మరింత ఆలస్యం:

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. జూన్ 4 లేదా 5 తేదీలలో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ప్రజలకు మండుటెండల నుంచి అప్పుడే ఉపశమనం లభించేలా లేదు. కేరళకు వచ్చిన రెండు మూడు రోజుల తర్వాతే ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయి.

కుమారుడికి మంత్రి పదవి:

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ మార్పుపై వీరిద్దరూ చర్చలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై కూడా సిద్ధూ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు. తన కుమారుడు యతీంద్రకు కీలక మంత్రి పదవి ఇవ్వాలని ఆయన హైకమాండ్‌ను కోరారు.

హార్ముజ్ జలసంధిపై ట్రంప్:

ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను సడలించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాత్కాలిక శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై తానేం సంతృప్తిగా లేనని చెప్పారు. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలాల్లో భాగమని ఆయన అన్నారు. దీనిపై ఏ ఒక్క దేశానికీ నియంత్రణ ఉండకూడదనీ, అది అందరికీ అందుబాటులో ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు:

దక్షిణ లెబనాన్‌లోని సైదా, టైర్ నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ భీకర దాడుల్లో ఒకే భవనంలో పలువురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. హెజ్బుల్లా డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత ఉద్ధృతం చేసింది. సరిహద్దు బఫర్ జోన్ దాటి ముందుకు వెళ్తున్నామని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.

‘పెద్ది’ ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.600:

రాంచరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3న రాత్రి జరిగే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా ఖరారు చేశారు. సినిమా విడుదలైన మొదటి వారం రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించారు. రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డైరెక్టర్‌గా సీఎం విజయ్ కుమారుడు:

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SIGMA’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా జులై 31న విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *