Top10 News: యోగా దినోత్సవం, నీట్ రీ-ఎగ్జామ్.. ఇరాన్ శాంతి చర్చలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: యోగా దినోత్సవం, నీట్ రీ-ఎగ్జామ్.. ఇరాన్ శాంతి చర్చలు.. ఈ రోజు టాప్10 న్యూస్ |


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేశారు. ఒక సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలకు మాత్రమే నష్టం వస్తుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.

2. మధ్యప్రదేశ్ నుంచే నా పోరాటం

తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర దాగి ఉందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. తనపై ఎలాంటి లీగల్ కేసులూ లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ కుట్రలను ప్రజల ముందుకు తీసుకెళ్తానన్నారు. తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచే రాజకీయ పోరాటం కొనసాగిస్తానని ఆమె చెప్పారు.

3. కోల్‌కతాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రెడ్ రోడ్డులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం సహా సుమారు 35 వేల మంది పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత యోగా వేడుకల కోసం పశ్చిమబెంగాల్‌ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. యోగాను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేయవద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

4. విజయవాడలో వైభవంగా ‘యోగాంధ్ర’

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు స్వయంగా బాబా రాందేవ్‌తో కలిసి యోగాసనాలు వేశారు.

5. వెంటిలేటర్‌పై ఉంటూనే నీట్ పరీక్ష రాసిన విద్యార్థిని

తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి వెంటిలేటర్‌పై ఉన్న సృష్టి దుబే అనే విద్యార్థిని పట్టుదలతో నీట్ రీ-ఎగ్జామ్ 2026 రాసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక చొరవతో అంబులెన్స్ ఏర్పాట్ల మధ్య హాస్పిటల్ డ్రెస్‌లోనే ఆమె ఈ పరీక్షను పూర్తి చేసింది. కష్టాలను అధిగమించి ఆమె చూపిన ధైర్యం దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది. పరీక్ష ముగిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు మంత్రికీ, ఎన్‌టీఏకీ కృతజ్ఞతలు తెలిపారు.

6. రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి

తమిళనాడు తిరువళ్లూర్‌లోని ఓ ప్రైవేటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థత చెందడంతో స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక కలెక్టర్ బాధితులను పరామర్శించి, ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై తనకు పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం విజయ్ ఆదేశించారు.

7. బాక్సాఫీస్ దగ్గర ‘మా ఇంటి బంగారం’ వసూళ్ల వర్షం

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే రూ.13 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.15 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. వీకెండ్ కావడంతో వసూళ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

8. చేదు అనుభవాలను మర్చిపోవాలి

అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చిన శోభిత ధూళిపాళ ప్రస్తుతం ‘వెట్టువం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మర్చిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బాధాకరమైన సంఘటనలను మర్చిపోవడం.. జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. గతంలోనే చిక్కుకుపోకుండా భవిష్యత్తుపై సానుకూలంగా దృష్టి పెట్టాలని శోభిత సూచించారు.

9. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్

అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందానికి తీవ్ర విఘాతం ఏర్పడింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 32 మంది మరణించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తన హామీలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ నౌకాయాన, చమురు రవాణాపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.

10. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే టోల్ విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదనీ, రవాణా యథావిధిగా కొనసాగుతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు స్విట్జర్లాండ్‌‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఈ చర్చలు ఫలించకపోతే.. ఇరాన్‌పై మరిన్ని తీవ్ర దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ట్రూత్‌తో పోస్ట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports