Last Updated:
Bigg Boss Telugu 10: రోహిత్‌పై త్రిగుణ్ చేసిన బాడీ షేమింగ్, పర్సనల్ కామెంట్లపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిగుణ్‌కు గట్టి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, టైర్ ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ చుట్టూ రౌండ్లు కొట్టాలని పనిష్మెంట్ విధించారు.
Trigun Punishment For Rohith: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎప్పుడూ సరదాలు, నవ్వులే కాదు.. హద్దులు దాటి ప్రవర్తించిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించే కౌన్సిలింగ్ కూడా! ఈ వారం హౌస్‌లో సెలబ్రిటీల అహంకారం, ముఖ్యంగా కామనర్ రోహిత్‌పై త్రిగుణ్ చేసిన దిగజారుడు కామెంట్లపై హోస్ట్ నాగార్జున విశ్వరూపం చూపించారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే నాగ్.. ఈసారి మాత్రం ఆగ్రహంతో ఊగిపోతూ త్రిగుణ్ అహంకారాన్ని నేలకేసి కొట్టారు. ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ ఘట్టం రానే వచ్చింది; త్రిగుణ్ చేసిన బాడీ షేమింగ్, పర్సనల్ ఎటాక్స్‌ను స్క్రీన్‌పై ప్లే చేసి మరీ ముఖం మీదే కడిగిపారేశారు.














