ఇక ఇటీవలి కాలంలో తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay)తో త్రిష ప్రేమాయణం నడుపుతోందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రాజకీయంగా కూడా ఈ వ్యవహారంపై కొందరు నాయకులు, సినీ ప్రముఖులు హద్దులు దాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు, వివాదాలకు దారితీశాయి. అయినప్పటికీ, త్రిష ఈ వివాదాలపై సంయమనం పాటిస్తూ, తనదైన శైలిలో హుందాగా బదులిస్తూ వస్తున్నారు. రూమర్లను పక్కనపెట్టి తన సినీ ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా కొనసాగిస్తూ నేటితరం హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.













