Last Updated:
ఇప్పుడున్న మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో సినిమాలు చేస్తుంటాడు అనే పేరు ఉంది వరుణ్ తేజ్‌కు. రిజల్ట్‌తో సంబంధంలేకుండా ప్రతీ సినిమాను కొత్తగా చూపించాలని ట్రై చేస్తుంటాడు. అయితే.. కొత్తగా ట్రై చేసిన ప్రతీసారి సినిమాలు బెడిసి కొడుతున్నాయి.
ఇప్పుడున్న మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో సినిమాలు చేస్తుంటాడు అనే పేరు ఉంది వరుణ్ తేజ్‌కు. రిజల్ట్‌తో సంబంధంలేకుండా ప్రతీ సినిమాను కొత్తగా చూపించాలని ట్రై చేస్తుంటాడు. అయితే.. కొత్తగా ట్రై చేసిన ప్రతీసారి సినిమాలు బెడిసి కొడుతున్నాయి. దాంతో ఈ సారి మాస్ అవతారం ఎత్తేశాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి అల్టీమేట్ ఎంటర్‌టైనర్స్ తీసిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ మరణ మాస్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా పేరే కొరియన్ కనక రాజు మూవీ. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మాములు అంచనాలు లేవు. గ్లింప్స్‌తో పాటు టీజర్ గట్రా సినిమాపై ఓ లెవల్‌లో అంచనాలు పెంచేశాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే.. కొరియన్ కనకరాజు సినిమాకు దాదాపు రూ.38 కోట్ల వరకు బడ్జెట్ అయింది. కాగా.. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమాకు అక్షరాల రూ.26 కోట్లు వచ్చినట్లు సమాచారం. అంటే ఆల్రెడీ ఈ సినిమాకు మరో రూ.12 కోట్లు వస్తే బడ్జెట్ రికవరీ అయిపోతుంది. ఈ నెంబర్స్ చూస్తుంటేనే అసలు సినిమాపై హైప్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయంటే మాములు విషయం కాదు.
ఇక గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్‌కు అలాంటి మాస్ బొమ్మ ఒక్కటి పడితే మాములుగా ఉండదని అనుకున్న మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా గ్లింప్స్, టీజర్‌లు చూసిన తర్వాత మాములు అనే పదం కూడా చిన్నగా అయిపోయింది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో మెగా విశ్వరూపం చూపించబోతున్నాడని ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ సినిమా బ్యాక్ దాదాపుగా కొరియన్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాదు మాఫియా డాన్, స్మగ్లర్ రోల్‌ను వరుణ్ తేజ్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ గ్లింప్స్‌లో విజిల్‌తో అదరగొట్టింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇక ఇప్పటికిప్పుడు వరుణ్‌కు ఒక్క హిట్టు పడితే కానీ కెరీర్ గాడీలో పడదు. అసలు మెగా ప్రిన్స్ సోలో హిట్టు కొట్టి 6 ఏళ్లు అయిపోయింది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. ఆ తర్వాత గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మాట్కా.. ఇలా ఒకదానికి మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్‌లుగా మిగిలాయి. మధ్యలో వెంకీమామాతో కలిసి చేసిన f3 సినిమా మాత్రమే హిట్టు. అయితే ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ వెంకీమామ ఖాతాలోనే పడిపోయింది. ఈ లెక్కన వరుణ్ తేజ్ హిట్టు కొట్టక ఆరేళ్లు అయింది. మరీ ఈ కొరియన్ కనకరాజ్ సినిమాతోనైనా మెగా ప్రిన్స్.. మెగా కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














