Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే | | ACTPnews

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే |


ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు

ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ మృతులు

1. నల్లపేట ఆదిశేషయ్య రవితేజ

2. శ్రీధర్ ముడియం

3. జయలక్ష్మి గెల్లి

తమిళనాడు మృతులు

1. సెంథిల్ కుమార్ జయవేల్

2. మురుగ ప్రభు ఆరుముగం

3. శ్రీధర్ సుందరరాజన్

4. షేక్ అబ్దుల్లా అబ్దుల్ మజీద్

5. బాలాజీ నటేషన్

6. వినయ్ కుమార్ చిత్తాపురం భాస్కర

7. రవిశంకర్ సుగుమారన్

8. సంతోష్ కుమార్ శాంతిలాల్ జైన్

9. బాబు కుప్పుస్వామి

10. అలగురాజన్ శివసామి

కేరళ మృతులు

1. అవికోట్ చెరియన్ థామస్

2. లోవేని థామస్

సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. మెరైన్ రెస్క్యూ సిబ్బందితో కూడిన అత్యవసర బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, ప్రాణాలతో బయటపడిన వారికి తక్షణ వైద్య సహాయాన్ని అందించారు.

ఈ ఉదంతంపై హనోయిలోని భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. తాము స్థానిక వియత్నాం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని స్పష్టం చేసింది. వియత్నాంలో భారతీయ పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో (గత 2025లో 7.4 లక్షల మందికి పైగా భారతీయులు వియత్నాంను సందర్శించారు) ఈ ఘోర ప్రమాదం జరగడం భారతీయ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *