Last Updated:
గత వారం రోజులుగా కొంత మంది సామాజిక మాధ్యమాల వేదికగా హీరో విజయ్ దేవరకొండపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ రియాక్ట్ అవుతూ అసలు విషయం చెప్పేసింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం హీరో విజయ్ దేవరకొండకు కొత్త కాదు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా కొంత మంది సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతూనే ప్యాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్న విజయ్ స్టార్డమ్ పై కొంత మందికి అసూయ పుట్టి ఇలా చేస్తున్నారు. కావాలని విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అతని వ్యక్తిగత ప్రవర్తనపై తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్. తాజాగా దీనిపై ఆయన టీమ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.
తన కొత్త సినిమా రణబాలి షూటింగ్ లో విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్స్ కు ప్రొడక్షన్ భారం పెరిగేలా చేస్తున్నాడంటూ ఫేక్ న్యూస్ పోస్టులు చేస్తున్నారు. విజయ్ 50, 60 మంది అసిస్టెంట్స్ కావాలని, 5-6 కార్వాన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆయన డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియా, వే 2 ఎస్ఎంఎస్, 123 తెలుగు.కామ్ వంటి పేరున్న వైబ్ సైట్స్ రాసినట్లు క్రియేట్ చేసి, ఆయా సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కొందరు నెటిజన్స్, ఫ్యాన్స్ ఇలా దిగజారి సోషల్ మీడియాలో వ్యవహరించడాన్ని విజయ్ దేవరకొండ టీమ్ ఖండించింది. ఈ అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకుల్ని కోరింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని, ఉంటాడని వెల్లడించింది. పలు సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేసి ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై, ఆయా సంస్థలతో పాటు సైబర్ క్రైమ్ శాఖ చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 26, 2026 11:56 AM IST













