Last Updated:
హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జూన్ 13 నుంచి ఆప్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మ్యాచ్ చివర్లో తొడ వెనుక కండరాల గాయమైన విషయం తెలిసిందే. జూన్ 13, 17, 20 తేదీల్లో ఈ మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి.
ఆప్ఘనిస్థాన్‌తో జూన్ 13 నుంచి జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుండి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమయ్యారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మ్యాచ్ చివర్లో హ్యామ్‌స్ట్రింగ్ (తొడ వెనుక కండరాల గాయం) గాయానికి గురయ్యారు. ఈ ద్వైపాక్షిక సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయం తీవ్రత వల్ల కోహ్లీ ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు పీటీఐకి స్పష్టం చేశాయి. బెంగళూరు జట్టును వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ దూరం కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గత న్యూజిలాండ్ సిరీస్‌లో జైస్వాల్ బెంచ్‌కే పరిమితమవగా, గైక్వాడ్ దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిల్ ఆర్డర్లో రాణించారు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఐపీఎల్లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడటంతో, ఫిట్నెస్ సాధిస్తేనే ఈ సిరీస్ మొత్తం అందుబాటులో ఉంటారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఈ వన్డే సిరీస్‌కు సారథ్యం వహిస్తున్నారు.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి వన్డే జూన్ 13 శనివారం ధర్మశాలలో జరగనుంది. జూన్ 17 బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో రెండో వన్డే, జూన్ 20 శనివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చివరి వన్డే నిర్వహిస్తారు. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 01:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వన్డేల కంటే ముందు జూన్ 6 నుండి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ చండీగఢ్‌లో జరగనుంది.
India’s squad for ODI series against Afghanistan: Shubman Gill (C), Rohit Sharma, Shreyas Iyer (VC), KL Rahul (WK), Ishan Kishan (WK), Hardik Pandya, Nitish Kumar Reddy, Washington Sundar, Kuldeep Yadav, Arshdeep Singh, Prasidh Krishna, Prince Yadav, Gurnoor Brar, Harsh Dubey
| DATE(S) | DAY(S) | MATCH | VENUE | START TIME (IST) |
|---|---|---|---|---|
| June 13 | Saturday | 1st ODI | Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala | 01:30 PM |
| June 17 | Wednesday | 2nd ODI | Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow | 01:30 PM |
| June 20 | Saturday | 3rd ODI | MA Chidambaram Stadium, Chennai | 01:30 PM |
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jun 04, 2026 11:56 AM IST













