Last Updated:
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ ఎందుకు వెళ్లిపోయారో డాక్టర్ శ్రీరామ్ నేనే వెల్లడించారు. భారతదేశంలో స్టార్‌డమ్ వల్ల కనీసం ప్రశాంతత లేకుండా పోయిందని అనుష్క తనతో చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం తమ పిల్లలతో కలిసి లండన్‌లో స్థిరపడిన విషయం తెలిసిందే. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఈ సెలబ్రిటీ జంట దేశాన్ని విడిచిపెట్టి లండన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనుష్క శర్మతో గతంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు.














