ముఖ్యంగా సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్లు, హోర్డింగుల కింద నిలబడవద్దని హెచ్చరించారు.














