Last Updated:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భాష్యకార కైంకర్య ట్రస్ట్ 28 ఏళ్లుగా పవిత్ర గొడుగులను సమర్పిస్తోంది. ఒక్కో గొడుగు తయారీకి 55-60 రోజులు పడుతుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే భక్తుల సందడి ఎంత ప్రత్యేకమో.. స్వామివారికి సమర్పించే సేవలు, కైంకర్యాలు కూడా అంతే విశిష్టంగా ఉంటాయి. అలాంటి ఓ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని తమిళనాడుకు చెందిన భక్తుల బృందం ఏళ్లుగా కొనసాగిస్తోంది. తిరువళ్లూరు జిల్లా తిరునిన్రవూర్‌కు చెందిన భాష్యకార కైంకర్య ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి పవిత్ర గొడుగులను సమర్పించారు. ఈ సేవను గత 28 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.













