Thalapathy Vijay: తలా కోసం దళపతి.. అక్కడే త్రిష.. మరోసారి రిలేషన్‌షిప్ రూమర్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

Thalapathy Vijay: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో శనివారం నిర్వహించిన మిచెలిన్ లే మాన్స్ కప్ (Michelin Le Mans Cup) రేసు సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.

PC: X.com
PC: X.com

తమిళనాడు సీఎం దళపతి విజయ్, తలా అజిత్ కుమార్‌ను కలుసుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైచెలెన్ లే మాన్స్ కప్ రేసులో పాల్గొంటున్న అజిత్‌ను వ్యక్తిగతంగా అభినందించేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు విజయ్ అక్కడికి వెళ్లారు. సర్క్యూట్ వద్దకు చేరుకున్న విజయ్‌ను చూసి అడగడుగునా ఆప్యాయంగా స్వాగతం పలికిన అజిత్ వైపు.. విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ గత రెండు దశాబ్దాలుగా అత్యంత ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మెలుకువగా ఉండటం విశేషం. ఇక ఇదే ఈవెంట్‌కు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. జీన్స్, టీ-షర్ట్, మెరూన్ జాకెట్ ధరించి కారు దిగి రేసింగ్ సర్క్యూట్ టెంట్‌లోకి వెళ్తున్న ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports