Last Updated:
తిరుమలలో పారదర్శకత లేదా? ఆ దర్శనాల లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు!
తిరుమల పవిత్రతను కాపాడేందుకు, పరిపాలనలో పూర్తిస్థాయి పారదర్శకతను పెంచేందుకు టీటీడీలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా టీటీడీ అడిషనల్ ఈఓ (జేఈఓ) కార్యాలయ పరిధిలో జవాబుదారీతనం తీసుకొచ్చేలా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన టీటీడీ యాజమాన్యాన్ని కోరారు. దేవాదాయ శాఖలో అత్యంత కీలకమైన ఈ విభాగంలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేస్తేనే సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.













