YSRCP Shyamala | ‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు | ACTPnews

YSRCP Shyamala | ‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు



తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు పాలనలో సామాన్యులకే కాదు, చివరికి దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయింది” అని మండిపడ్డారు. అలిపిరి ఘాట్ రోడ్డులో 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురవడం టీటీడీ భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోందని, దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్యామల మాట్లాడిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *