Last Updated:
తిరుమలలో శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో వరాహ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
తిరుమలలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆదివరాహక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో వరాహ జయంతి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.














