Last Updated:
దేశంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నాయి.. కానీ 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క రైల్వే ట్రాక్ కూడా లేదు! అసలు ఆ జిల్లాలు ఏవి?
దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైస్పీడ్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు రైలు మార్గం అందుబాటులో లేదు. ముఖ్యంగా కేరళలోని వయనాడ్, ఇడుక్కి, కర్ణాటకలోని కొడగు జిల్లాలు ఇప్పటికీ రైలు పట్టాలకు దూరంగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు రవాణానే ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది.














