Last Updated:
రాజ్యసభలో ‘లుంగీ’ ఒక్కసారిగా రాజకీయ వివాదానికి కారణమైంది. కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్ను “లుంగీ-వాలా” అంటూ పిలిచారని ఆయన చేసిన ఆరోపణలతో సభలో చర్చ మొదలైంది. అసలు సుష్మితా దేవ్ ఏం అన్నారు? ఆమె ఆరోపణలను ఎందుకు ఖండించారు?
రాజ్యసభలో బుధవారం ‘లుంగీ’ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. కేరళకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్.. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనతో జరిగిన వాగ్వాదంలో పదేపదే “లుంగీ-వాలా” అంటూ సంబోధించారని ఆరోపించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా లుంగీతో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళకు ఉన్న సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.














