Last Updated:
తూప్రాన్ పోలీసులు వరుస చోరీలకు పాల్పడిన కందురి సత్యనారాయణను అరెస్టు చేశారు. ఇతను మొబైల్ ఫోన్ వాడడు, తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా చోరీలు చేశాడు.
తాళం వేసి కనిపించే ఇళ్లు, వాణిజ్య దుకాణాలనే టార్గెట్‌గా చేసుకుని రాత్రివేళల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని తూప్రాన్ పోలీసులు అరెస్టు చేశారు. పగటిపూట రెక్కీ చేసి.. రాత్రి తాళాలు పగులగొట్టి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లే ఈ నిందితుడి వ్యవహారం పోలీసులకే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అతడు మొబైల్ ఫోన్ వినియోగించకపోవడంతో అతడి కదలికలను ట్రేస్ చేయడం మరింత సవాల్‌గా మారినట్లు పోలీసులు తెలిపారు.














