ప్రభుత్వ శాఖల్లో అవినీతి బాగోతం.. ఒక్క ఏడాదిలో 70,584 ఫిర్యాదులు.. ఎక్కువగా ఎక్కడంటే? | | ACTPnews

News18


Last Updated:

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వేలు, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలపై 2025లో 70,584 అవినీతి ఫిర్యాదులు నమోదయ్యాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదిక ప్రకారం, వీటిలో అధిక భాగం పరిష్కరించినప్పటికీ 5,679 ఫిర్యాదులు ఏడాది చివరి నాటికి పెండింగ్‌లోనే ఉన్నాయి. బ్యాంకులు, రైల్వేలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా నమోదైన వాటిలో ఉన్నాయి.

News18
News18

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, రైల్వేలు, స్థానిక సంస్థలకు సంబంధించి భారీ సంఖ్యలో అవినీతి ఫిర్యాదులు నమోదయ్యాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) 2025 వార్షిక నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొత్తం 70,584 అవినీతి ఫిర్యాదులు చీఫ్ విజిలెన్స్ అధికారులు (CVOలు) స్వీకరించారు. వీటిలో 64,905 ఫిర్యాదులను డిసెంబర్ 31, 2025 నాటికి పరిష్కరించినట్లు నివేదిక వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *