Last Updated:
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి హాజరయ్యారు. పలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు హవాలా మార్గాల ద్వారా ఆమెకు డబ్బులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్టేట్మెంట్ను ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. ఇదే కేసులో గతంలో సీఐడీ అధికారులు కూడా నిధి అగర్వాల్‌ను విచారించారు.














