Last Updated:
తిరుమలలో పోటెత్తిన రద్దీ.. సర్వదర్శనానికి ఏకంగా 24 గంటలు..
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి భక్తుల రద్దీ నిరంతరంగా సాగుతోంది. సామాన్యులతో పాటే పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఆపదమొక్కులవాడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సంగీత వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటే టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి కూడా వేర్వేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వీరు భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరుడిని పూజించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.













