కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! | | ACTPnews

సిద్ధరామయ్య, డీకే శివకుమార్


Last Updated:

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కొత్తగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. పదవులు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది.

News18
News18

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని స్థాయిలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో కొత్తగా 19 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మొదటి నుంచి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ అసమ్మతి సెగ ఏకంగా ఎమ్మెల్యేల రాజీనామాలకు దారితీసింది. తమకు మంత్రి పదవులు దక్కకపోవడాన్ని నిరసిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మంత్రివర్గ కూర్పుపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మరోవైపు.. ఈ కీలకమైన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకాకపోవడం పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని తేటతెల్లం చేస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. జాబితాలో పేరున్న మహిళా నేత గాయత్రి శాంతేగౌడ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బెంగళూరులో జరిగింది. మొత్తం 19 మంది నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. జాబితాలో పేరు ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలు గాయత్రి శాంతేగౌడ ఈ కార్యక్రమానికి రాలేదు. ఆమె గైర్హాజరీ వెనుక అసంతృప్తి ఉందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇక మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారిలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఏకంగా తమ పదవులకే రాజీనామా చేశారు. మరికొందరు నేతలు కూడా అధిష్టానంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అసమ్మతిని చల్లార్చేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగినా ఫలితం కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ అసమ్మతి స్వరం మరింత పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం సిద్ధరామయ్య వైఖరి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన వర్గానికి సరైన ప్రాధాన్యం దక్కలేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక నేత అయిన సిద్ధరామయ్య అలకతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడింది. పరిస్థితి చేయిజారక ముందే ఈ సంక్షోభానికి చెక్ పెట్టాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed