Last Updated:
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మృనాళ్ స్నేహితురాలు విదుషి పరాశర్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోను మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీ షేర్ చేసింది. ఇంకేముంది.. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో మృనాళ్.. తన స్నేహితురాలి పెళ్లి వేడుకలో బాలీవుడ్ సింగర్ దిల్జిత్ ఆలపించిన ‘లవర్’ సాంగ్‌కు క్లాస్ స్టెప్పులు వేస్తూ కనిపించింది. రెడ్ కలర్ శారీలో డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అసలు మృణాల్‌ను అలానే చూస్తుండాలి అనిపించేంతగా తన స్టెప్పులతో దిల్ పాగల్ అయ్యేలా జేసింది. టీవీ సీరియల్ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన మృణాల్ మెట్టు మెట్టు ఎక్కుతూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. అసలు.. మృణాల్‌కు యూత్‌లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.
నాలుగేళ్ల కిందట వచ్చిన ‘సీతారామం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అసలు.. ఆ సినిమా మృణాల్ ఠాకూర్‌కు తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. సీతా మహాలక్ష్మీ, నూర్ జహాన్‌గా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంతేకాదు.. ఈ సినిమాలో తన నటనకు గానూ బెస్ట్ యాక్ట్రెస్‌గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత నానితో కలిసి చేసిన ‘హాయ్ నాన్న’ మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్ స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో యష్న రోల్లో జీవించేసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు నాని క్యారెక్టర్‌కు ఎంత కనెక్ట్ అయ్యారో.. మృణాల్‌కు కూడా అంతే కనెక్ట్ అయ్యారు.
ఆ తర్వాత విజయ్‌తో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ప్రభాస్ కల్కీలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ ఏడాది అడివిశేష్‌తో కలిసి డెకాయిట్ సినిమాలో నటించింది. ఏప్రిల్‌లో రిలీజైన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కమర్షియల్‌గా యావరేజ్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి రాకా సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తుంది. దీనితో పాటుగా పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమా కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














