Last Updated:
తిరుమల కొండపై పోలీసుల డేగకన్ను.. వీళ్లకు ఇక చుక్కలే.. అధికారుల అసలు టార్గెట్ ఎవరంటే?
కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తుల భద్రతకు, క్షేత్ర పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనీస ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ ఆదేశాలతో తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో భారీ స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొండపై అనుమతులు లేకుండా సాగుతున్న అనధికారిక కార్యకలాపాలకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో ఈ ముమ్మర తనిఖీలు సాగాయి.














