Last Updated:
మీరు పిల్లలు, వృద్ధులతో తిరుమల వెళ్తున్నారా? అయితే ఎస్పీ చెప్పిన ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందే!
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆ ఆధ్యాత్మిక రద్దీలో అప్పుడప్పుడు పిల్లలు, వయోవృద్ధులు తమ వారిని తప్పిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి కష్టకాలంలో తిరుమల పోలీసులు వారికి ఆపద్బాంధవులుగా మారుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తోంది. తాజాగా శ్రీవారి దర్శనం కోసం వచ్చి కుటుంబ సభ్యులను తప్పిపోయి అయోమయానికి గురైన ఇద్దరు వృద్ధులను పోలీసులు అలిపిరి ఓపీ వద్ద గుర్తించి, సురక్షితంగా వారి బంధువులకు అప్పగించారు.














