Last Updated:
ENG vs PAK: అస్థిరమైన ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి తమ చెత్త ప్రదర్శనతో వార్తల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరూ కోరుకోని ఒక అత్యంత చెత్త రికార్డును పాకిస్థాన్ తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల పేలవ ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇరు ఇన్నింగ్స్‌ల్లోనూ పాక్ ఓపెనర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధికసార్లు ఈ తరహా చెత్త ఫీట్ నమోదు చేసిన ఏకైక జట్టుగా పాకిస్థాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది.














