పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ.. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

News18
News18

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక‌, సిరి హీరోయిన్లు నటిస్తున్న కొత్త కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్ర పూజా కార్యక్రమం జరిగింది. మజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సీనియ‌ర్ న‌టుడు బాబుమోహ‌న్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం తొలి షాట్‌కు సీనియర్ నటుడు బాబు మోహన్ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ‘అమ్మ రాజశేఖర్’ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. దర్శకుడు వి. సముద్ర, ఓయూ శంక‌ర్ గుండేటి ఈ వేడుక‌లో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో చాక్లెట్ స్టార్ పవన్ మాట్లాడుతూ, కథకు అనుగుణంగా ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. దర్శకుడు అశోక్ రోయ్య మాట్లాడుతూ, ‘‘ఇది నా రెండో సినిమా. ఈ చిత్రాన్ని మరింత వైవిధ్యంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాను. సినీ ప్రముఖులు, ప్రేక్షకుల ఆశీర్వాదాలు, ఆదరణ మాకు ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు అమ్మ రాజశేఖర్, హీరోయిన్ తదితరులు చిత్ర విశేషాలను వెల్లడిస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో రుగ్మతలు, మిస్టరీ, హారర్, సస్పెన్స్ అంశాలను మేళవిస్తూ ఈ కథను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కథలోని మలుపులు, పాత్రల స్వభావం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయని పేర్కొంది. మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.

ఈ సినిమాలో చాక్లెట్ స్టార్ పవన్ (హీరో), మౌనిక‌, సిరి (హీరోయిన్లు), ఇరుముడి ఫేం సాయి స్వ‌రూప్, సునీతా మ‌నోహ‌ర్, ఆనంద్, బ‌ల‌గం ర‌మేష్, సూర్య తేజ‌వ‌త్, రామ‌లింగం, అరుణ్ అఖిల్, శేఖ‌ర్, త‌ను, మ‌నీష్, త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించగా.. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed