Bigg Boss 10 Telugu: హద్దులు దాటేసిన ఆట, హీటెక్కిన నామినేషన్స్.. ఈ వారం హౌస్ నుంచి బయటకొచ్చేది ఎవరంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఐదో వారానికి చేరుకున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య అసలు రంగులు, వ్యూహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే హౌస్ లో నామినేషన్స్ పర్వం వేడెక్కింది.

News18
News18

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఐదో వారానికి చేరుకున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య అసలు రంగులు, వ్యూహాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే నామినేషన్ల ప్రక్రియ ఈ వారం ఓ రేంజ్‌లో హీటెక్కింది. నామినేషన్స్ అంటేనే ఒకరిపై ఒకరు ఉన్న కోపాన్ని, అసంతృప్తిని బయటపెట్టే వేదిక. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ ఏకంగా రణరంగాన్ని తలపించింది.

హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. ముఖ్యంగా అపూర్వను మిగిలిన హౌస్‌మేట్స్ అంతా కలిసి టార్గెట్ చేసినట్లు, కార్నర్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. అపూర్వ కెప్టెన్సీ పనితీరుపై ముఖేష్, వర్షిణి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షిణి అయితే ఏకంగా “వరస్ట్ కెప్టెన్” అంటూ అపూర్వపై గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అపూర్వ, త్రిగుణ్ మధ్య జరిగిన వాగ్వాదం శృతి మించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. ఇది ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఇక రామ్ ప్రసాద్.. అమన్‌ను ఫిజికల్ గేమ్ ఆడుతున్నాడనే కారణంతో నామినేట్ చేయగా, రోహిత్, వంశీల మధ్య కూడా పెద్ద గొడవే జరిగింది.

ఫైర్ బ్రాండ్స్, కూల్ కంటెస్టెంట్స్ అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగడంతో హౌస్ దద్దరిల్లింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఐదో వారంలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. వారిలో త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్, రామ్ ప్రసాద్ ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎవరికి వారు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను సేవ్ చేసుకునేందుకు ఓటింగ్ క్యాంపెయిన్స్ మొదలుపెట్టారు.

ఈ వారం నామినేషన్ల విషయానికొస్తే.. ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురే షాలినీ, చరణ్, అమన్. గత వారం ఎలిమినేషన్ అంచున నిలబడి తృటిలో సేవ్ అయిన షాలినీ.. తన తీరు మార్చుకోలేదని ఆడియన్స్ భావిస్తున్నారు. రోహిత్‌తో ఆమె నడుపుతున్న ఫేక్ లవ్ ట్రాక్, హౌస్‌లో అనవసరంగా అరుస్తూ చేసే రచ్చ ప్రేక్షకులకు తీవ్ర చిరాకు తెప్పిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే ఆమె ఈ వారం ఎలిమినేట్ అవ్వడం పక్కా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చరణ్ విషయానికొస్తే.. ఇంట్లో అసలు ఉన్నాడా లేదా అన్నట్లుగా అతడి ఆటతీరు ఉంది. ఎటువంటి పర్ఫామెన్స్ ఇవ్వకుండా ఇప్పటివరకు ఎలా సర్వైవ్ అయ్యాడనేది అందరి ప్రశ్న. హోస్ట్ నాగార్జున స్వయంగా చరణ్ ఆటతీరుపై చురకలు అంటించినా అతడిలో మార్పు రాలేదు. మరోవైపు, అపూర్వ కేవలం గొడవల్లో తప్ప గేమ్‌లో పెద్దగా ప్రభావం చూపడం లేదు, అమన్ ఆట కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.

ఇక బయట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రోహిత్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లోనే ఉన్నారని ఓటింగ్ ట్రెండ్స్ బట్టి అర్థమవుతోంది. ఏది ఏమైనా ఈ ఐదో వారం నామినేషన్స్ అగ్నిపరీక్షగా మారాయి. డేంజర్ జోన్‌లో ఉన్న అమన్, షాలినీ, చరణ్‌లలో ఈ వారం నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed