స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. హాట్ కేకుల్లా టికెట్స్ సోల్డ్ అవుట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ కి భారీ డిమాండ్ కనిపిస్తోంది.

News18
News18

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను మరింత అద్భుతంగా ప్రేక్షకులకు అందించేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంస్థ P[XL], Big Pix, Screen X, ICE, 4DX, MX4D వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో విడుదల చేయనుంది. దీంతో అభిమానులు అత్యంత భారీ అనుభూతితో సినిమాను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచం తనను మరచిపోయిన పరిస్థితుల్లో స్పైడర్-మ్యాన్‌గా నేరాలతో పోరాడుతున్న పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకునే కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే రహస్యమైన శత్రువు చుట్టూ ఈ చిత్రం కథ సాగుతుంది.

“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” జూలై 30, 2026న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టామ్ హాలండ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి.

ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ ఇండియా హెడ్ షోనీ పంజికరన్ మాట్లాడుతూ.. “భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో స్పైడర్-మ్యాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే ఈ చిత్రాన్ని అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతితో అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము” అని తెలిపారు. అలాగే పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ అండ్ ఆపరేషన్స్ సీఈవో గౌతమ్ దత్త మాట్లాడుతూ… “స్పైడర్-మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్రాంచైజీ. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై అభిమానులతో కలిసి వీక్షించడం మరపురాని అనుభూతిని అందిస్తుంది” అని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports