Last Updated:
సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.
సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. కేవలం ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించాడన్న కోపంతో ఓ 13 ఏళ్ల బాలిక తన కన్న తాతనే హత్య చేయించిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలోని ఓ క్రైమ్ సీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని, మరో ముగ్గురు మైనర్ల సహకారంతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.














