72 National Film Awards: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’ సినిమాలో అసాధారణమైన నటనకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.

News18
News18

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శనివారం (జూలై 18) అధికారికంగా ప్రకటించారు. 2024 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సర్టిఫికేషన్ పొందిన భారతీయ సినిమాలను ఈ అవార్డులకు పరిగణనలోకి తీసుకున్నారు. భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే ఈ అవార్డులు ఉత్తమ ప్రతిభను గుర్తిస్తూ ప్రతి ఏడాది ప్రధానం చేస్తారు.

ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’ సినిమాలో అసాధారణమైన నటనకు ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఇద్దరూ తమ తమ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుతో మరో గొప్ప గుర్తింపును సొంతం చేసుకున్నారు.

జాతీయ అవార్డుల ప్రకటనను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని PIB ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ఈ ప్రకటనను ఆసక్తిగా వీక్షించారు.

జాతీయ చలనచిత్ర అవార్డులు కేవలం నటనకే పరిమితం కావు. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌లు, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు, సినీ రచనలు, దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, సాంకేతిక విభాగాలు సహా అనేక కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డుల ద్వారా సత్కరిస్తారు. భారతీయ సినిమా నాణ్యతను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే కళాకారులను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశం.

ఈ సారి విజేతల ఎంపిక బాధ్యతలను ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ నిర్వహించింది. దేశంలోని పలు భాషల్లో విడుదలైన చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన జ్యూరీ, అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఎంపిక చేసి తమ సిఫార్సులను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అనంతరం మంత్రిత్వ శాఖ అధికారికంగా విజేతల జాబితాను విడుదల చేసింది.

2024లో భారతీయ సినీ పరిశ్రమ విభిన్న భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘లాపతా లేడీస్’ వంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై కూడా భారతీయ సినిమాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరోవైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘స్త్రీ 2’, ‘హనుమాన్’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ప్రేమలు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *