Top 10 News: కేదార్‌నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు


భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు.

2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు

సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మహిళలపై దాడులను సహించబోమని, రాజకీయ అండ చట్టం నుంచి ఎవరినీ కాపాడదని స్పష్టం చేశారు.నిందితుడు సొంత పార్టీకి చెందినవాడైనా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

3. సబిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గృహనిర్బంధం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను కూడా ఆయన ఇంట్లో నిర్బంధించారు. యువసంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహనిర్బంధం చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

4.ఇప్పటి వరకు ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క

సరూర్‌నగర్‌లో జరిగిన ‘యువ సంగ్రామ’ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి, నోటిఫికేషన్ల స్థానంలో ‘లూటిఫికేషన్లు’ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. యువత, నిరుద్యోగులు ఈ మోసాన్ని మర్చిపోరని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.

5. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ప్రాజెక్ట్ మేఘాలయ

తమిళనాడులో జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో కుట్ర జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా టీవీకే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.35 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎంకే నేత కార్తి, వ్యాపారవేత్త రమేష్ సహా 9 మందిని అరెస్టు చేశారు.

6.దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే

ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర మళ్లీ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.ఇవాళ ఉదయం పోలీసులు 20 రోజులుగా దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేయడంతో,కాక్రోజ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇవాళ నిరాహార దీక్షకు దిగారు.ఈ నెల 20న ఛలో పార్లమెంట్ నిర్వహించి తీరతామని ఆయన ప్రకటించారు.వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసినా, తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

7.కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్రను జులై 17న తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ, కేదార్‌నాథ్ మార్గంలో గ్యాప్ లేకుండా వర్షాలు పడుతుండటంతో కొండరాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం యాత్రను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

8.ఆమిర్‌ ఖాన్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్ బెదిరింపులు

ప్రియురాలు గౌరీ స్ర్పాట్‌ను మూడో వివాహం చేసుకుని మతపరమైన వివాదానికి తావిచ్చారంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన ఈ పెళ్లికి త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బిష్ణోయ్ సోదరుడు అర్జూ, టైసన్‌లకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ద్వారా వారు హెచ్చరించారు.

9.లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్:

ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్‌ లో చిక్కుకున్న ఎంపీ శశిథరూర్‌ సురక్షితంగా బయటపడ్డారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు థరూర్ శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ స్ర్పెడర్‌ (hydraulic spreader) సాయంతో లిఫ్ట్ తలుపులను విడదీసి థరూర్‌తో పాటు అందులో ఉన్న మిగతా 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

10.హర్మూజ్‌లో సీమైన్స్‌ ఢీకొని.. పేలిన చమురు ట్యాంకర్లు:

హర్మూజ్‌లో ముందుపాతరలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయి. అమెరికా నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో ఈ నౌకల సదరు మార్గం మీదుగా ప్రయాణించాయి’’ అని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన నాలుగు నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది. మరోవైపు ఏడోరోజు కూడా ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports