Last Updated:
72nd National Film Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards)కు వేళైంది.
శనివారం సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా ఈ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు, అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన చిత్రాలు పోటీ పడుతుండటంతో, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా వివిధ కేటగిరీల్లో పురస్కారాలు ఎవరిని వరించనున్నాయనే దానిపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ సారి ఉత్తమ నటుడి పురస్కారం కోసం విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఐదుగురు స్టార్ నటుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం రేసులో ముందుండగా, ఆయనకు మాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ మమ్ముట్టి (బ్రహ్మయుగం) నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరితో పాటు విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్రమ్ (తంగలాన్), మలయాళ నటులు సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), ఆసిఫ్ అలీ (కిష్కింద కాండం)లు కూడా ఉత్తమ నటుడి రేసులో నిలిచారు.
గత కొన్ని ఏళ్లుగా జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతుండగా, ఈసారి కూడా ఉత్తమ నటుడి రేసులో ఉన్న ఐదుగురు నటులూ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం విశేషం. వైవిధ్యమైన కంటెంట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రాలలో జాతీయ అవార్డు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana