Last Updated:
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని, చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గుత్తాధిపత్యం, థియేటర్ల సిండికేట్, నెపోటిజంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సినిమాలకు జరుగుతున్న అన్యాయంపై ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు. బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతిలో బందీగా మారిన ఇండస్ట్రీలో.. చిన్న చిత్రాలు కనీసం ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం కూడా నోచుకోవడం లేదంటూ ఆయన ఏకంగా సినీ పెద్దలపైనే న్యాయపోరాటానికి దిగారు.














