Last Updated:
ICC World Cup 2027: 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీసుకున్న తాజా నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ సారథి స్టీవ్ వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వాస్తవానికి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ 50 ఓవర్ల మెగా ఈవెంట్‌లో 14 జట్లు తలపడాల్సి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రధాన టోర్నీలో కేవలం 12 జట్లే ఆడనున్నాయి. కొత్త ఫార్మాట్ ప్రకారం.. 12, 13, 14వ ర్యాంకుల్లో ఉన్న జట్లు ముందుగా క్వాలిఫైయింగ్ రౌండ్‌లో తలపడతాయి. అందులో నుంచి విజేతగా నిలిచిన ఒక్క జట్టు మాత్రమే మిగతా 12 ప్రధాన జట్లతో కలుస్తుంది. ఆ తర్వాత మొత్తం 12 జట్లను చెరో ఆరు జట్లతో రెండు గ్రూపులుగా విభజించి ప్రధాన టోర్నీని నిర్వహిస్తారు.














